News November 30, 2024
ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు రెండు రోజుల సెలవులు ప్రకటించారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు కోరారు.
Similar News
News February 11, 2026
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పక్రియ: ఖమ్మం CP

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న 5 మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఏదులాపురం, వైరా, కల్లూరు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలలో కొనసాగుతున్న ఎన్నికల నేపథ్యంలో పలు పోలింగ్ స్టేషన్లను సీపీ సందర్శించి, పోలీస్ బందోబస్త్ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 11, 2026
ఖమ్మం కలెక్టరేట్ నుంచి పోలింగ్ పర్యవేక్షణ

ఖమ్మంలోని ఐదు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ బుధవారం కలెక్టరేట్ నుంచి పర్యవేక్షించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా 117 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సరళిని ఐదు ప్రత్యేక స్క్రీన్లపై పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా వెబ్ క్యాస్టింగ్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
News February 11, 2026
పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం: సీపీ సునీల్ దత్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని సీపీ సునీల్ దత్ బుధవారం పర్యటించి పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన.. భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలతో నిఘా ఉంచామన్నారు.


