News February 7, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 70 వేల బస్తాలు..!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 70 వేల బస్తాలు మార్కెట్కు రావడంతో షెడ్లు అన్ని కళకళలాడాయి. గురువారం జెండా పాట క్వింటాకు రూ.14,025 ధర పలకింది. గత ఏడాది రూ.20వేలకు పైగా ధర లభిస్తే.. ఇప్పుడు రూ.14వేలుగా ఉంది. ఈ ధర గత ఏడాది తాలు మిర్చికి వచ్చిన ధర కావడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి మిర్చి మార్కెటకు వచ్చింది.
Similar News
News November 17, 2025
ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.

VMLD: కనువిందు చేస్తున్న ఆలయ పార్కింగ్ స్థలం (వీడియో)

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ పార్కింగ్ స్థలం వాహనాలతో కనువిందు చేస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో రావడంతో రద్దీ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ పార్కింగ్ స్థలం భారీ వాహనాలతో స్పెషల్ అట్రాక్షన్గా దర్శనమిస్తోంది. ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా రాజన్నను దర్శించుకుంటున్న భక్తులు, కోడె మొక్కులను భీమన్న ఆలయంలో చెల్లించుకునేందుకు బారులు తీరారు.