News February 7, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 70 వేల బస్తాలు..!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 70 వేల బస్తాలు మార్కెట్‌కు రావడంతో షెడ్‌లు అన్ని కళకళలాడాయి. గురువారం జెండా పాట క్వింటాకు రూ.14,025 ధర పలకింది. గత ఏడాది రూ.20వేలకు పైగా ధర లభిస్తే.. ఇప్పుడు రూ.14వేలుగా ఉంది. ఈ ధర గత ఏడాది తాలు మిర్చికి వచ్చిన ధర కావడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి మిర్చి మార్కెటకు వచ్చింది.
Similar News
News February 8, 2026
ఉత్తర తెలంగాణలో BJP vs MIM

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఆ జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మున్సిపల్, కార్పొరేషన్లలోనూ పాగా వేయాలని భావిస్తోంది. అయితే ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో MIM అభ్యర్థులు బరిలో నిలిచారు. గతంలో నిజామాబాద్‌లో 16, కరీంనగర్‌లో 15 డివిజన్లు గెలుచుకున్న MIM.. ఈసారీ మేయర్ ఎంపికలో కీలకంగా మారనుంది.
News February 8, 2026
మహబూబాబాద్: సామాజిక మాధ్యమంలో ప్రచార జోరు!

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రగులుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. సంప్రదాయ ప్రచారానికి భిన్నంగా ఇన్ స్టా రీల్స్, వాట్సాప్ స్టేటస్‌లను పెడుతున్నారు. తమ హామీలను వివరిస్తూ ఆకట్టుకునే వీడియోలు, ప్రత్యేకంగా రాయించిన పాటలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో అభ్యర్థుల ప్రచార జోరు కొనసాగుతోంది.
News February 8, 2026
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్, ఎస్పీకీ ఆహ్వానం

శ్రీశైలంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని దేవస్థానం అధికారులు ఆహ్వానించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమెను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్‌ను కలిసి బ్రహ్మోత్సవాల పత్రికతో పాటు మల్లన్న ప్రసాదాన్ని అందజేసి ఆహ్వానించారు.


