News May 20, 2024

ఖమ్మం- శ్రీకాకుళం సూపర్ లగ్జరీ సర్వీసు ప్రారంభం

image

ఖమ్మం-శ్రీకాకుళం మధ్య సూపర్ లగ్జరీ సర్వీసులు ప్రారంభించినట్లు DM యు.రాజ్యలక్ష్మి తెలిపారు. 9937 సర్వీస్ నెంబర్ గల బస్సు ఖమ్మంలో 6:15 బయలుదేరుతుందన్నారు. 9938 సర్వీస్ నెంబర్ గల బస్సు శ్రీకాకుళంలో 4:00 స్టార్ట్ అవుతుందని చెప్పారు. మరిన్ని వివరాలకు 99592 25990 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News December 5, 2025

ఖమ్మం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News December 5, 2025

చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

image

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్‌కుమార్, రాజ్‌బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్‌కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News December 5, 2025

ఖమ్మం: గంజాయి నిందితులకు జైలు శిక్ష

image

గంజాయి నిందితులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు. ఖమ్మం-వరంగల్‌ క్రాస్‌ రోడ్డుతో పాటు కొత్త బస్టాండ్ వద్ద గంజాయి తరలిస్తూ 2022 ఏప్రిల్ 10, 2024 జనవరి 10న నిందితులు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని గురువారం కోర్టులో హాజరు పరచారు. ఒక్కొక్కరికి 20, 10 సం.ల జైలు శిక్షలతో పాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు.