News February 24, 2025

ఖమ్మం: శ్రీనివాసరావు పార్థివదేహానికి మంత్రి నివాళి 

image

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు గుండెపోటుతో సోమవారం ఆకస్మికంగా మృతిచెందడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి తుమ్మల వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Similar News

News February 25, 2025

తీర్థాల జాతరకు వచ్చే భక్తులకు ఖమ్మం కమిషనర్ సూచనలు

image

> ఖమ్మం పట్టణం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు దానవాయిగూడెం, రామన్నపేట, కామంచికల్ మీదుగా వచ్చి కామంచికల్ మున్నేరు వాగు బ్రిడ్జ్ రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ చేయాలి.> ఇక ట్రాక్టర్లు, లారీలు కామంచికల్, పటివారిగూడెం నుంచి జాన్బాద్ తండా వెళ్లే దారిలోని కామంచికల్ బ్రిడ్జి దగ్గర పార్కింగ్ చేయాలి. 

News February 25, 2025

సత్తుపల్లిలో GOVT స్కూల్ ఫ్లెక్సీ అదుర్స్ 

image

మనం చాలా చోట్ల కార్పొరేట్ స్కూళ్లకు చెందిన ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులు చూస్తుంటాం.. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ  ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారంటూ ఉపాధ్యాయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువులో రాణించడంతోపాటు ఏ పోటీల్లో పాల్గొన్నా బహుమతి కచ్చితమంటూ ఫ్లెక్సీ ద్వారా ఆ టీచర్లు ప్రచారం చేస్తున్నారు. 

News February 25, 2025

ఖమ్మం: సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెనుబల్లి మండలం టేకులపల్లిలో సోమవారం రైతులతో సమావేశమై సాగు నీటి విడుదల షెడ్యూల్‌పై ముందుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. టెయిల్ ఎండ్ ప్రాంతాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామంలో తాగునీటి సరఫరా, విద్య, వైద్యం అంశాలను పరిశీలించారు. అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

error: Content is protected !!