News October 12, 2024
ఖమ్మం: శ్రీలక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి

విజయ దశమి పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామి దేవస్థానంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ పండితులు, అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేదపండితులు ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళీ, గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు.
Similar News
News November 12, 2025
87% బిల్లులు డిజిటల్తోనే: ఖమ్మం ఎస్ఈ

TGNPDCL డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవడంతో, వినియోగదారులు ఆన్లైన్లో బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 87% మంది టీజీఎన్పీడీసీఎల్ యాప్, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. తద్వారా కౌంటర్లకు వెళ్లే శ్రమ లేకుండా, సురక్షితంగా బిల్లులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
News November 12, 2025
వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.
News November 12, 2025
ఖమ్మం: దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఆన్లైన్లో ఉన్న దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలి.


