News January 8, 2025
ఖమ్మం: సంక్రాంతికి 1030 ప్రత్యేక బస్సులు: RM

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం రీజియన్లోని అన్ని డిపోల నుంచి 1030 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్టీసీ ఆర్ఎం సరిరామ్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 14 వరకు హైదరాబాద్-ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు 585, 15 నుంచి 20వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం-హైదరాబాద్కు 445 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సీట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 27, 2025
ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపిక, భూవివాదాలు వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, తగు చర్యలు తీసుకోవాలని వారు జిల్లా అధికారులను ఆదేశించారు.
News October 27, 2025
ఖమ్మం: వారి మధ్య డీసీసీ ఫైట్

ఖమ్మం డీసీసీ అధ్యక్ష పదవి కోసం మంత్రులు పొంగులేటి, భట్టి, తుమ్మల అనుచరుల మధ్య పోటీ నెలకొంది. భట్టి వర్గం నుంచి నూతి సత్యనారాయణ గౌడ్, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి వర్గం నుంచి సూతకాని జైపాల్, పీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల వర్గం నుంచి కార్పొరేటర్ కమర్తపు మురళి ఉన్నారు. వీరే కాక ఎంపీ రేణుకాచౌదరి ఫాలోవర్స్ కూడా పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
News October 27, 2025
ఖమ్మం: నేడే లక్కీ డ్రా.. తీవ్ర ఉత్కంఠ..!

ఖమ్మం జిల్లాలో 2025-27 మద్యం పాలసీకి సంబంధించిన 122 దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఎక్సైజ్ అధికారులు ఈ డ్రాను ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్, లకారం రిక్రియేషన్ జోన్ వద్ద తీయనున్నారు. ఈ 122 దుకాణాల కోసం 4,430 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.132.90 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. నేడు నిర్వహించే ఈ లక్కీ డ్రాలో వైన్స్ టెండర్ ఎవరికి దక్కుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


