News January 8, 2025

ఖమ్మం: సంక్రాంతికి 1030 ప్రత్యేక బస్సులు: RM

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి 1030 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్టీసీ ఆర్‌ఎం సరిరామ్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు HYD-ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు 585, 15 నుంచి 20వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం-HYDకు 445 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సీట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News January 10, 2025

పర్యాటక ప్రాంతంగా ఖమ్మం ఖిల్లా అభివృద్ధి: కలెక్టర్

image

ఖమ్మం ఖిల్లా పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేయనున్న రోప్‌వే, జాఫర్ బావి అభివృద్ధితో ఖమ్మం పర్యాటక ప్రాంతంగా మారుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం ఖమ్మం ఖిల్లాను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఖిల్లాకు రోప్‌వే ఏర్పాటుకు అనువుగా ఉండే మార్గం, ఎక్విప్మెంట్, ఖిల్లాకు రావడానికి రోడ్డు అనుకూలత, పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.

News January 9, 2025

పండగకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలి: ఖమ్మం సీపీ

image

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పండుగ నేపథ్యంలో పహారాను మరింత పెంచుతామని చెప్పారు. అందుకనుణంగా ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని సీపీ సూచించారు. 

News January 9, 2025

నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేయాలి: తుమ్మల

image

ఖమ్మం జిల్లాలోని డైట్ కళాశాల ద్వారా నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేసి సమాజానికి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం టేకులపల్లిలో పర్యటించి డైట్ అడ్మినిస్ట్రేటివ్ భవన ఆధునీకరణ, అదనపు సదుపాయాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. 70 సం.ల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యను అభివృద్ధి చేయలేక పోయామని చెప్పారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా కీలకమైందన్నారు.