News March 10, 2025
ఖమ్మం: సత్వరమే అర్జీల పరిష్కారం చేయాలి: కలెక్టర్

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 8, 2025
ఖమ్మం: 1064 టోల్‌ఫ్రీతో అవినీతికి అడ్డుకట్ట: కలెక్టర్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. 1064 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు చేస్తే అవినీతిని అరికట్టవచ్చని తెలిపారు. అధికారులు, ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలు ఏ పనికైనా లంచం ఇవ్వొద్దని, ఎవరైనా వేధిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ రమేష్, అధికారులు పాల్గొన్నారు.
News December 8, 2025
ఖమ్మం: అవినీతి ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్: కలెక్టర్

అవినీతి నిరోధక శాఖ (ACB) వారోత్సవాల సందర్భంగా సోమవారం (డిసెంబర్ 8న) కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ACB పోస్టర్‌ను విడుదల చేశారు. అవినీతిపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064 తో పాటు, వాట్సాప్, ఈమెయిల్ మరియు ACB ఖమ్మం DSP నంబర్ (9154388981) ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
News December 8, 2025
ఖమ్మం: మద్యం దుకాణాలు బంద్

డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9న సాయంత్రం 5:00 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలన్నారు.


