News November 24, 2024

ఖమ్మం: సర్వే డేటా ఎంట్రీ కీలకం: భట్టి

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకున్నదని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భట్టి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో 5,68,493 ఇండ్లను సర్వే కోసం గుర్తించామని, ఈనెల 23 నాటికి మొత్తం 4,78,868 ఇండ్ల సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News December 7, 2024

మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు: డిప్యూటీ సీఎం భట్టి

image

రాష్ట్ర మహిళా సంఘాలతో రూ.1000 మెగావాంట్ల సామర్థ్యం ఉన్న సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. వారికి బ్యాంకులతో రుణాలు ఇప్పించి, ఉత్పత్తయిన కరెంటుని గ్రిడ్‌కి కనెక్ట్ చేయించి, తద్వారా వారికి డబ్బులు చెల్లించేలా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీకి తరలుతున్న నేపథ్యంలో కొత్త విద్యుత్తు విధానం తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.

News December 6, 2024

దేశంలో రక్తహీనత కేసులు ఎక్కువయ్యాయి: ఎంపీ రఘురాం రెడ్డి

image

దేశంలో మహిళలు, గర్భిణులు, బాలింతలు, పిల్లలపై రక్తహీనత తీవ్ర ప్రభావం చూపుతోందని, ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది తెలియదా..? అని లోక్ సభలో ప్రశ్నించారు. దీని నివారణకు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలతో వచ్చిన మార్పు వివరాలు ఏమిటని అడిగారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ మేరకు శుక్రవారం లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నలో కోరారు.

News December 6, 2024

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల

image

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌లోని దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. పవర్ ప్లాంట్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వారు తెలిపారు.