News February 25, 2026
ఖమ్మం: సైబర్ ట్రాఫికింగ్‌పై అప్రమత్తత అవసరం

మహిళలు, యువతులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ ట్రాఫికింగ్‌పై అంగన్‌వాడీ టీచర్లు సమాజంలో అవగాహన కల్పించాలని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి విజేత పిలుపునిచ్చారు. ‘ప్రజ్వల’ సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రేమ, ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు అండగా నిలవాలని ఆమె సూచించారు.
Similar News
News April 15, 2026
ఆర్టీసీ బస్సు ఢీకొని సీపీఐ నేత మృతి

తల్లాడ మండలంలోని నరసింహరావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్ దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్ మృతితో మండలంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సంతాపం వ్యక్తం చేశారు.

News April 14, 2026
గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం కావాలి: టీపీసీసీ చీఫ్

ఖమ్మం డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి, ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్‌కి ఎప్పుడూ అండగా నిలిచిందని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.