News February 9, 2025
ఖమ్మం: స్థానిక సమరానికి రె‘ఢీ’

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. తాజాగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సమాయాత్తమవుతోంది. ఇటీవలే మండల కేంద్రాల్లో జాబితాను రూపొందించి, ప్రదర్శించారు. జిల్లాలో 8,52,879 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Similar News
News October 31, 2025
సీఎం సారూ.. ఖమ్మం రండి: ముంపు వాసులు

ఖమ్మంలో మున్నేరు ముంపు వాసులను ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. 26 అడుగులకు పైగా మున్నేరు ప్రవహించిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వరదతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ఈ రోజు వరంగల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఖమ్మంలో పర్యటించడం లేదు. దీంతో ముంపు వాసులు సీఎం తమ ప్రాంతంలో పర్యటించి తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
News October 31, 2025
నేటి నుంచి విజయ డెయిరీ దుకాణాలకు టెండర్లు

ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ.15వేలుగా నిర్ణయించామని, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు చెల్లించాలన్నారు.
News October 31, 2025
మాజీ సర్పంచ్ రామారావు హత్యపై సీపీ ఆరా

చింతకాని పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఎం నేత సామినేని రామారావు హత్య ఘటనపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీపీఎం నేతలు గోపాలరావు, సుదర్శన్ నుంచి ఆయన వివరాలు సేకరించారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీపీ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.


