News March 13, 2025
ఖమ్మం: హామీలన్నీ కాంగ్రెస్ సమర్థంగా అమలు చేస్తుంది: మువ్వా

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ సమర్థంగా అమలు చేస్తుందని TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. గురువారం ఆయన సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అండ అని, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సీఎం రేవంత్ ఆలోచన, లక్ష్యంతో ముందుకెళ్తున్నారన్నారు. గాదె సత్యం, బాణోత్ కాంతమ్మ కుటుంబాలను పరామర్శించారు.
Similar News
News December 20, 2025
GHMC వార్డుల విభజన.. బయటికొచ్చిన మ్యాపులు (EXCLUSIVE)

గ్రేటర్ హైదరాబాద్ వార్డుల పునర్విభజనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు ఆదేశాలతో లంగర్ హౌస్ (వార్డు 134), షా అలీ బండ (వార్డు 104)లకు సంబంధించిన సరిహద్దు మ్యాపులను అధికారులు వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం లంగర్ హౌస్లో 50,484 మంది, షా అలీ బండలో 32,761 మంది జనాభా ఉన్నట్లు తేలింది. బాపు ఘాట్, మూసీ నది, గోల్కొండ కోట గోడల వెంట వార్డుల విభజన తీరు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
News December 20, 2025
కాకినాడ సుబ్బయ్య హోటల్లో అధికారుల తనిఖీలు

కాకినాడ సుబ్బయ్య హోటల్లో శనివారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచే హోటల్ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్న అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. అధికారులు రాకముందే హోటల్ యజమానులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సోదాల అనంతరం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.
News December 20, 2025
పార్వతీపురం: ‘ప్లాస్టిక్ తయారీ యూనిట్లపై నిరంతర నిఘా ఉంచాలి’

ప్లాస్టిక్ తయారీ యూనిట్లపై పరిశ్రమల శాఖ నిరంతర నిఘా ఉంచాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్కెట్లు, దుకాణాలు, గ్రామీణ వారపు సంతల్లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


