News March 13, 2025

ఖమ్మం: హామీలన్నీ కాంగ్రెస్‌ సమర్థంగా అమలు చేస్తుంది: మువ్వా

image

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్‌ సమర్థంగా అమలు చేస్తుందని TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. గురువారం ఆయన సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అండ అని, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సీఎం రేవంత్ ఆలోచన, లక్ష్యంతో ముందుకెళ్తున్నారన్నారు. గాదె సత్యం, బాణోత్ కాంతమ్మ కుటుంబాలను పరామర్శించారు.

Similar News

News March 15, 2026

రేపు కోటంరెడ్డి మీడియా సమావేశం

image

కొద్దికాలం విరామం అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. నిరంతరమైన ప్రజల్లో ఉంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మీడియా సమావేశాల్లో కాస్త తగ్గించిన అభివృద్ధి జోరు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

News March 15, 2026

BHPL: ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

భూపాలపల్లి జిల్లాలోని అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి ఇందిర తెలిపారు. ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్లు, సోలార్ పంపు సెట్ల యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. 21-60 ఏళ్ల వయస్సు ఉండి, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోగా ఉన్నవారు అర్హులు.

News March 15, 2026

విశాఖ: టెన్త్ పరీక్షలు రాసేవారికి బస్సులో ఉచిత ప్రయాణం

image

పదో తరగతి పరీక్షల దృష్ట్యా, విద్యార్థులు హాల్ టికెట్ చూపి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రకటించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.