News October 26, 2024
ఖమ్మం – హైదరాబాద్ రాజధాని నాన్ స్టాప్ బస్సులు
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త రాజధాని ఏసీ నాన్ స్టాప్ బస్సులను ఈ నెల 28 నుంచి నడుపుతున్నట్లు ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు. అడ్వాన్స్ – టికెట్ల కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్‌లో బుకింగ్ చేసుకోవాలన్నారు.
Similar News
News November 10, 2024
చండ్రుగొండ : హాస్టల్లో పాము కలకలం
చండ్రుగొండ ఎస్సీ బాలుర వసతి గృహంలో పాము ప్రత్యక్షమైంది. హాస్టల్ బాత్రూంలో నుంచి పాము బయటకు వస్తున్న క్రమంలో స్థానికులు గుర్తించారు. ఆ సమయంలో హాస్టల్లో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మిగతావారు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. అయితే హాస్టల్ పరిసర ప్రాంతం పిచ్చి మొక్కలు చెత్తాచెదారంతో నిండి ఉంటుందని స్థానికులు చెప్పారు. శుభ్రం చేయించాలని కోరారు.
News November 10, 2024
కచ్చితమైన సమాచారంతో వివరాలు నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్
కులగణన సర్వే కోసం జారీ చేసిన బుక్ లెట్లోని మొత్తం అంశాలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుంచి కచ్చితమైన సమాచారం సేకరణతో నమోదులు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సర్వే ప్రక్రియను సూపర్‌వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ బాధ్యులు సూపర్ చెక్ చేయాలని, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
News November 9, 2024
ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డిపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధు పార్టీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి సీఎం అయినా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు సరికాదని జిల్లా అధ్యక్షుడు అన్నారు. సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర అధ్యక్షుడు నాగరాజు, నాయకులు బ్రహ్మయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.