News February 20, 2025

ఖమ్మం: హోంగార్డ్ నరేశ్ మృతి.. కారణం ఏంటి?

image

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని డిగ్రీ కాలేజ్ సమీపంలోని మినీ హైడల్ పవర్ ప్రాజెక్టు వద్ద సాగర్ కాలువలో హోంగార్డ్ నరేశ్(36) <<15520402>>మృతదేహం కలకలం<<>> సృష్టించిన విషయం తెలిసిందే. ఉదయం కాలువలో నరేశ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అయితే ఆయన ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయారా..? లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News March 26, 2025

నత్తనడకన LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ

image

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 99,913 దరఖాస్తులు ఉండగా.. 61,343దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించాయి. ఇందులో 5,731 మంది దరఖాస్తుదారులే ఫీజు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.

News March 26, 2025

ఖమ్మం జిల్లాలో 59,061 మంది రైతుల ఖాతాల్లో నగదు

image

రైతుభరోసా నగదును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఖమ్మం జిల్లాలో 59,061 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం రూ.60.87 కోట్లు జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఐదెకరాల మేర సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. జిల్లాలో ఇంకా 86 వేల మంది రైతులకు వారికి ఉన్న భూమి ఆధారంగా రూ.156 కోట్ల సాయం అందాల్సి ఉంది.

News March 26, 2025

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

image

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్‌ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.

error: Content is protected !!