News February 12, 2026
ఖమ్మం: 44,706 అక్రిడిటేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. జీవో 103 ద్వారా పారదర్శకంగా 44,706కార్డులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఉన్న 23 వేల కార్డులను ఇప్పుడు దాదాపు రెట్టింపు చేశామన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాతో పాటు చిన్న పత్రికలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Similar News
News March 14, 2026
విజయవాడ: రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు వేదిక మార్పు

విజయవాడలో ఈ నెల 16న ప్రభుత్వం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు వేదిక మారినట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశా తెలిపారు. గతంలో నిర్ణయించిన ఏ1 కన్వెన్షన్ సెంటర్‌కు బదులుగా, ఇప్పుడు ఏ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మత పెద్దలు, ప్రజాప్రతినిధుల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News March 14, 2026
సిరిసిల్ల: ‘మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలి’

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. సిరిసిల్లలోని నెహ్రూ నగర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరంతరం మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో మహిళలందరూ సభ్యులుగా చేరాలన్నారు. దేశంలో గంటకు ఇద్దరు మహిళపై లైంగిక దాడులు జరుగుతుందన్నారు.
News March 14, 2026
నంద్యాల: అప్పటిలా వెంటనే అందడం లేదు!

జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. బుక్ చేసుకున్న 5-7 రోజులకు డెలివరీ ఇస్తున్నారు. సిలిండర్ ధరతో పాటు డెలివరీ ఛార్జీ పేరుతో రూ.1,040 నుంచి రూ.1,050 వరకు తీసుకుంటున్నట్లు పలు గ్రామాల ప్రజలు చెప్తున్నారు. గతంలో బుక్ చేసుకున్న వెంటనే సిలిండర్లు వచ్చేవని, ప్రస్తుతం 5 నుంచి వారం రోజులు పడుతోందని వాపోతున్నారు. ఇదే అదనుగా కొందరు బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.


