News August 24, 2024
ఖమ్మం: 7,04,615 మంది కార్డుదారులకు లబ్ధి
‘చౌకదుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ’ హామీని జనవరి నుంచి అమలుచేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ పథకం అమలైతే.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 1,190 రేషన్ దుకాణాల పరిధిలో 7,04,615 మంది కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ షిప్ కూడా తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News September 7, 2024
భద్రాద్రి రామయ్యకు సువర్ణ తులసి అర్చన
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం స్వామివారికి సువర్ణ తులసి అర్చన నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News September 7, 2024
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం
వినాయక చవితి పండుగ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని డిప్యూటీ సీఎం అన్నారు.
News September 7, 2024
ఖమ్మం: రూ.3.43 కోట్లకు వ్యాపారి ఐపీ
ఖమ్మం బ్యాంకు కాలనీకి చెందిన పురుగుమందుల వ్యాపారి నూతలపాటి రవి స్థానిక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో రూ.3.43 కోట్లకు శుక్రవారం ఐపీ దాఖలు చేశారు. 32 మంది రెండు దాతలను ప్రతివాదులుగా చేర్చారు. కామేపల్లి మండలం పెంజరమడుగుకు చెందిన పిటిషనర్ పండితాపురంలో పురుగుమందులు, విత్తనాల వ్యాపారం నిర్వహించాడు. వ్యాపార నిమిత్తం తెచ్చిన అప్పులు తీర్చలేక ఐపీ దాఖలు చేశారు.