News February 15, 2025

ఖమ్మం: DCCB, PACS పదవీకాలం పొడిగింపు

image

సహకార సంఘాల కాలపరిమితి, 9 డీసీసీబీ ఛైర్మన్ ల పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి వీరి గడువు ముగుస్తున్నా ఎన్నికలకు సంబంధించి ఇంత వరకు రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో సహకార సంఘాల పాలకవర్గ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Similar News

News March 22, 2025

ఫోన్ చూస్తూ తింటున్నారా.. జాగ్రత్త!

image

చాలామందికి తినే సమయంలోనూ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ప్లేటులో ఏముందో కూడా పట్టించుకోకుండా తినేవారు ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తినే ప్రతి ముద్దను ఆస్వాదిస్తే అరుగుదల మెరుగ్గా ఉంటుంది. దృష్టి ఫోన్‌పై ఉంటే ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా మనకు తెలీదు. దీని వల్ల పోషకాహార లోపమో లేక ఊబకాయం రావడమో జరుగుతుంది. రెండూ ప్రమాదమే’ అని వివరిస్తున్నారు.

News March 22, 2025

చారకొండ: మాజీ ఆర్మీ జవాన్ విగ్రహం ధ్వంసం

image

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని బోడబండ తండాకు చెందిన మాజీ ఆర్మీ జవాన్ మహిపాల్ నాయక్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాణవత్ శంకర్ నాయక్ డిమండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గు చేటని అన్నారు. దుండగులు విగ్రహం ముక్కు ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలన్నారు.

News March 22, 2025

అచ్చంపేట: ప్రమాదకరంగా మారిన కల్వర్టు

image

అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టుకు రక్షణ లేక ప్రమాదకరంగా మారింది. ఈ ప్రధాన రహదారిపై రోజుకు హైదరాబాద్, దేవరకొండ ప్రాంతాలకు వందల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి. ఈ రహదారి పై ఉన్న కల్వర్టుకు రెండు వైపులా ఎలాంటి రెయిలింగ్‌ లేకపోవడంతో వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ రూట్లో ప్రయాణం చేయాలంటే భయంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

error: Content is protected !!