News February 17, 2025
ఖమ్మం: KCRపై అభిమానం అదుర్స్

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కస్నాతండాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిర్చి రైతులు వినూత్నంగా మిరప కల్లంలో హ్యాపీ బర్త్ డే కేసీఆర్ అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రైతు లక్న్మయ్య తన మిర్చి కల్లాంలో కేక్ కట్ చేసి కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 27, 2025
ఆర్టీసీ కార్మికుల సేవలు భేష్: ఖమ్మం కలెక్టర్

ప్రజల జీవన వ్యవస్థ సజావుగా సాగేందుకు కృషి చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయమని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కొనియాడారు. ఖమ్మం బస్సు డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడి పని చేస్తున్నారని, ప్రస్తుత వేసవిలో వారికి ఉపయోగపడే విధంగా జిల్లా యంత్రాంగం తరుఫున 650 బాటిల్స్ పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
News March 27, 2025
ఖమ్మం: మహిళా మార్ట్ ప్రత్యేకంగా ఉండాలి: కలెక్టర్

సాధారణ మాల్స్‌లా కాకుండా మహిళా మార్ట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని సీక్వెల్ రోడ్డులో ఏర్పాటవుతున్న మహిళా మార్ట్ పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఈ మార్ట్‌లో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు తయారుచేసే వస్తువులను విక్రయించనుండగా.. వాటి తయారీ, మహిళా సంఘం సభ్యుల వివరాలతో డాక్యుమెంటరీ ప్రదర్శించాలని తెలిపారు.
News March 27, 2025
ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్లకు రూ.లక్ష రుణం: కలెక్టర్

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముందు డబ్బులు పెట్టుకోలేని నిరుపేదలకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వివిధ మండలాల్లోని పైలట్ గ్రామాల్లో మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పైలట్ గ్రామాల్లో ఎంపిక చేసిన 850 లబ్ధిదారుల్లో ఇంటి నిర్మాణానికి ముందు రుణాలను ఇవ్వాలని అన్నారు.