News March 3, 2025

ఖమ్మం: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494

Similar News

News November 14, 2025

వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ

image

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పసికూన UAE-Aని భారత్-A బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. దోహాలో జరుగుతున్న టీ20లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్ ఏకంగా 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదారు. దీంతో ఇండియా-A 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 149 రన్స్ చేసింది.

News November 14, 2025

VMRDA కమిషనర్‌గా తేజ్ భరత్ బాధ్యతలు

image

VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఇటీవల ప్రభుత్వంచే నియమించబడ్డ తేజ్ భరత్ శుక్రవారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం VMRDA ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్‌ను కలిసి సంస్థ ప్రస్తుతం చేపడుతున్న పలు అభివృద్ది పనుల పురోగతి గురించి చర్చించారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయనను పరిచయం చేసుకున్నారు.

News November 14, 2025

ఆర్మూర్: విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయండి: DIEO

image

ఇంటర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంటర్ బోర్డు కమిషనర్ సూచించిన మేరకు ప్రతి అధ్యాపకుడు ఉద్యోగి విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయాలని NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆర్మూర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, గిరిజన బాలుర జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.