News March 13, 2025
ఖమ్మం: MSG ఓపెన్ చేస్తే రూ.మూడున్నర లక్షలు మాయం

సైబర్ మోసగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.3.50 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన పుసులూరి ఉపేందర్ చౌదరి వరి కోత మెషీన్ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. 2 రోజుల క్రితం వాట్సాప్ ద్వారా పీఎం కిసాన్ యాప్ అని మెసేజ్ రాగా, దానిని ఓపెన్ చేయడంతో మంగళవారం రూ.3.50 లక్షలు అకౌంట్ నుంచి బదిలీ అయ్యాయని బాధితుడు వాపోయాడు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
Similar News
News February 10, 2026
సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఫిబ్రవరి 11న ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపల్ పరిధుల్లో పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా యజమానులు సహకరించాలని కోరారు.
News February 10, 2026
ఖమ్మం: రెండు రోజులు సెలవు ప్రకటించిన కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈనెల 11న జరగనున్న ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ జరగనున్న వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, ఏదులాపురం పరిధిలో ఈనెల 10, 11వ తేదీల్లో స్థానికంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 11న జరిగే పోలింగ్‌లో ఓటర్లందరూ పాల్గొనేలా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. కాగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News February 10, 2026
ఖమ్మం: 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి ప్రచారమైనా నిషేధమని స్పష్టం చేశారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 117 వార్డులకు 241 పోలింగ్ కేంద్రాలలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.


