News March 27, 2025
ఖమ్మం: POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో నేడు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా, ఖమ్మం డీసీసీ చీఫ్‌గా పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాధాకిషోర్, దీపక్ చౌదరి పోటీ పడుతున్నారు.
Similar News
News April 10, 2025
ఖమ్మం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ఖమ్మంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఎర్రుపాలెంలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ముదిగొండలో 40.8, నేలకొండపల్లిలో 40.5, ఖమ్మం(U) ఖానాపురం PS, ఖమ్మం(R) పల్లెగూడెంలో 40, లింగాల (కామేపల్లి), కారేపల్లిలో 39.2, సత్తుపల్లిలో 39, మధిరలో 38.6, మంచుకొండ (రఘునాథపాలెం) 38.5, తల్లాడలో 38.5, కల్లూరులో 37.5, గౌరారం ( పెనుబల్లి) 37.1 నమోదైంది.
News April 10, 2025
ఆత్మీయ కానుక ఆడపిల్ల: జిల్లా కలెక్టర్

ప్రేమానురాగాలకు ప్రతీకైన ఆడపిల్ల పుట్టడం తల్లిదండ్రులకు భగవంతుడు ఇచ్చిన ఆత్మీయ కానుక అని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మా పాప మా ఇంటి మణి దీపం కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆడబిడ్డకు జన్మించిన మౌనిక- సురేశ్ దంపతులను బుధవారం కలెక్టర్ ఖమ్మం సారధినగర్లోని వారి నివాసంలో శాలువాతో సన్మానించారు. ఇంటిలో అమ్మాయిలు ఉంటే ఇల్లు కళ కళ లాడుతుందని, ప్రతి ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించాలని పేర్కొన్నారు.
News April 9, 2025
ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి: జిల్లా కలెక్టర్

రఘునాథపాలెం: ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ నెలవారీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సిసి కెమెరాలను పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టుల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు.