News May 26, 2024
ఖమ్మం: REWIND.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచాడు..!

2021లో KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికలో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636ఓట్లు చెల్లలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. రేపు ఈస్థానంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2025
మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా

రేపు సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో జరగాల్సిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మార్పును గమనించాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
News November 18, 2025
సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
News November 18, 2025
రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

పేరెంట్-టీచర్స్ మీటింగ్ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.


