News March 11, 2025
ఖమ్మం: TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాల నిర్వాహణకు దరఖాస్తులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎన్కూర్, జూలూరుపాడు, సుజాతనగర్, దమ్మపేట, టేకులపల్లి, కూసుమంచి, కారేపల్లి మండల కేంద్రాలలో TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాల నిర్వాహణకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్గో ATM రామారావు తెలిపారు. లాజిస్టిక్స్ కేంద్రాలను నడిపేందుకు కంప్యూటర్, ప్రింటర్, వేయింగ్ మిషన్ కలిగి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9154298582 సంప్రదించాలన్నారు.
Similar News
News March 26, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

∆} కల్లూరును మున్సిపాలిటీగా మారుస్తాం: మంత్రి ∆} ఖమ్మం: కూలీల ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ ∆} ఖమ్మం: సీతారాముల కళ్యాణానికి 197 ప్రత్యేక బస్సులు ∆} నేలకొండపల్లి: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య ∆} ‘సత్తుపల్లి MLA గారూ మా సమస్యలు ప్రస్తావించండి’ ∆} లంకాసాగర్ క్రాస్ రోడ్డు వద్ద లారీ బీభత్సం ∆} సదాశివునిపేటలో చోరీ.. రూ.2.35లక్షలు చోరీ ∆} ఖమ్మం: బెట్టింగులపై ప్రత్యేక దృష్టి: ఖమ్మం సీపీ
News March 25, 2025
బెట్టింగులపై ప్రత్యేక దృష్టి: ఖమ్మం సీపీ

IPL బెట్టింగులపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని CP సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్షలో CP పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, పోక్సో కేసులలో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ అధికారులతో CP సమీక్ష జరిపారు.
News March 25, 2025
ఖమ్మం: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాచేపల్లికి చెందిన D.హరీశ్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 రోజులుగా ఇంట్లోంచి ఎవరు బయటకు రాకపోవడంతో ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.