News July 28, 2024
ఖమ్మం: Way2News ఎఫెక్ట్.. ఉపాధ్యాయురాలి సస్పెండ్

కల్లూరు మండలం పేరువంచ హైస్కూల్లో ఉపాధ్యాయురాలు శిరీష విద్యార్థుల జుట్టును కత్తిరించిన విషయంపై Way2News వార్తను ప్రచురించింది. స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అటు విద్యార్థుల జుట్టును కత్తిరించడం ఏంటని పలువురు ఉపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News July 10, 2025
ఖమ్మం: సీఎంఆర్ రిక‘వర్రీ’

జిల్లాలోని 66 మిల్లర్లు ప్రభుత్వానికి సకాలంలో సీఎంఆర్ బియ్యంను అందించడంలో విఫలమవుతున్నారు. 2024-25 యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు ప్రభుత్వానికి 60% మాత్రమే అందించారు. ఈ సీజన్లో 4,55,981,360 మె.ట ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా, 1,84,444,836 మె.ట బియ్యంను అప్పగించారు. మరో 1,21,298,515 మె.ట అందజేయాల్సి ఉండగా.. ఈ ఏడాది SEPతో గడువు ముగియనుంది. పెండింగ్ సీఎంఆర్‌పై అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.
News July 10, 2025
ఖమ్మంలో ఈ నెల 11న జాబ్ మేళా..!

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఖాళీగా ఉన్న 25 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంపికైన వారికి రూ.20 వేలు నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు 11 గంటలకు జరిగే మేళాలో పాల్గొనాలని సూచించారు.
News July 10, 2025
రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు: ఖమ్మం DAO

జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి D.పుల్లయ్య తెలిపారు. బుధవారం సత్తుపల్లి రామానగరంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు MRPకి మించి అధిక ధరలకు విక్రయించొద్దని హెచ్చరించారు. ఒక ఎరువు కొంటే మరొకటి కొనమని రైతులను ఒత్తిడి చేయవద్దని సూచించారు.