News February 23, 2025
ఖరారైన CM మంచిర్యాల జిల్లా పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లా పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ అధికారి నిర్మల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రేపు మ:2:15 నిమిషాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్‌కు చేరుకోనున్నట్లు తెలిపారు. మ.2:20కి సమావేశంలో పాల్గొంటారన్నారు. అనంతరం సాయంత్రం సా4:00గంటలకు తిరిగి బయలుదేరుతారు.
Similar News
News February 24, 2025
ADB: త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి..!

FEB 28 జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 9-12 వ తరగతి విద్యార్థులకు సైన్స్ ఇన్నోవేషన్స్ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్‌కు FEB 23 చివరి రోజు అని డీఈఓ ప్రణీత తెలిపారు. FEB 27, 28 తేదీల్లో పరీక్షలు ఉంటాయన్నారు. గెలుపొందిన వారికి FEB 28న రాష్ట్రపతి భవనంలో బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.
News February 24, 2025
ఆనందంగా ఉంది: కోహ్లీ

కీలక మ్యాచ్‌లో సెంచరీ చేయడం ఆనందంగా ఉందని పాక్‌తో గేమ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపారు. నా శక్తిని, ఆలోచనలను పూర్తిగా అదుపులో ఉంచుకొని ఎక్కువసేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రోహిత్ త్వరగా ఔటైనా తాను ఎక్కువ రన్స్ చేయడం సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. షాహీన్ బౌలింగ్‌లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అందుకే అతడిని వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా పిలుస్తారని కోహ్లీ కితాబిచ్చారు.
News February 24, 2025
సంగారెడ్డి: 1.08 కోట్ల రుద్రాక్షలు.. 18.06 అడుగుల శివలింగం

సంగారెడ్డి మండలం ఫసల్వాది సమీపంలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 1.08 కోట్ల రుద్రాక్షలతో తయారు చేసిన 18.06 అడుగుల శివలింగాన్ని ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రత్యేక పూజలు చేసి కోటి రుద్రాక్ష శివలింగాన్ని ఆవిష్కరించారు. 26న మహాశివరాత్రి సందర్భంగా కోటి రుద్రాక్ష శివలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.