News December 19, 2024

ఖరీఫ్ సీజన్లో రూ.361 కోట్లు మంజూరు: కలెక్టర్

image

ప.గో జిల్లా ఖరీఫ్ సీజన్‌లో రూ.361 కోట్లు పంట రుణాలను రైతులకు అందజేశామని జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో రూ.410 కోట్ల పంట రుణాలు మంజూరు చేయవలసి ఉండగా.. ఇప్పటికే రూ.162 కోట్ల రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. త్వరలోనే మిగిలిన రుణాలను పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Similar News

News January 23, 2025

ప.గో: పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష

image

ఉండ్రాజవరం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోపాల కృష్ణమూర్తికి ఏలూరు పోక్సోకోర్టు రెండున్నరేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్టు ఎస్సై శ్రీనివాస్ బుధవారం తెలిపారు. 2020వ సంవత్సరం ఫిబ్రవరి 28న పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా వాదోపవాదాలు తరువాత ఈ నెల 21న కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

News January 23, 2025

పెంటపాడు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఎస్సీ పేటకు చెందిన పెనుమాక పైడిరాజు (45) కూలీ పని చేసుకొని జీవిస్తున్నాడు. బుధవారం రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 23, 2025

భీమవరం: కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

image

భీమవరంలో ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయిన మైనర్ బాలిక ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలించి బాలిక పాలకొల్లు బస్టాండ్‌లో ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడని, అతని మాటలు నమ్మి వెళ్లిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. కాగా పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచించారు.