News July 17, 2024
ఖాజీపేట: దుక్కి దున్నాలంటే.. విద్యుత్ వైర్లు పట్టాల్సిందే!
ఖాజీపేట మండలంలోని కే.సుంకేసుల గ్రామంలో 11 కె.వి విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయి. పొలంలోకి వెళితే ఎప్పుడు ఏం జరుగుతుందో అని నిత్యం భయపడుతున్నామని రైతులు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. పొలం సాగు చేయలేకపోతున్నామని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News January 16, 2025
కడప: ‘అధికారులు పొలాలను పరిశీలించాలి’
వ్యవసాయ శాఖ అధికారులు పొలాలు, రైతుల దగ్గరికి వెళ్లడం లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యద ర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మాట్లాడుతూ.. రైతలు సాగు చేసిన పంటలకు సంబంధించిన సలహాలను, సూచనలను అధికారులు ఇవ్వడం లేదన్నారు. దీంతోనే పంటలు పూర్తిగా దెబ్బతిని పోతున్నాయని చెప్పారు. తక్షణమే పొలాలను పరిశీలించాలని కోరారు.
News January 16, 2025
కడప: ఇక పట్నం పోదాం..!
ఉమ్మడి కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. రాయచోటి నేతాజీ సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బస్సుల కోసం ఇలా ప్రయాణికులు వేచి చూశారు.
News January 16, 2025
తిరుమలలో కడప బాలుడి మృతి
తిరుమలలో కడప బాలుడు చనిపోయాడు. చిన్నచౌక్ ఏరియాకు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు 13వ తేదీన తిరుపతికి వెళ్లారు. వాళ్లకు 16వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించారు. ఈక్రమంలో తిరుమల బస్టాండ్ సమీపంలో లాకర్ తీసుకున్నారు. నిన్న సాయంత్రం వారి రెండో కుమారుడు సాత్విక్ శ్రీనివాస్ రాజు(3) ఆడుకుంటూ రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. కొండపై ఉన్న అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.