News March 11, 2025

ఖాద్రీశుడి సన్నిధిలో నారా లోకేశ్

image

కదిరిలో ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి నారా లోకేశ్ నిన్న రాత్రి స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాను. వేదపండితులు వసంత వల్లభుడికి ఆయనతో సంకల్పం చేయించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

Similar News

News November 12, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో 255 కేంద్రాలు ఏర్పాటు చేశామని, సెంటర్లలో అన్ని వసతులు సౌకర్యం కల్పించామన్నారు.

News November 12, 2025

టమాటాలో శిలీంద్రం ఎండు తెగులును ఎలా నివారించాలి?

image

శిలీంద్రం ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పొలం నుంచి పీకి దూరంగా కాల్చేయాలి. పంటకు సరిపడినంత నీటి తడులు అందించాలి. ఎక్కువగా నీరు పెట్టకూడదు. తెగులు సోకిన మొక్కలను తొలగించిన నేలను.. లీటరు నీటికి మాంకోజెబ్ 3గ్రాములు కలిపి బాగా తడపాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ ఉన్న మొక్కల వద్ద కూడా ఈ ద్రావణంతో నేలను బాగా తడపాలి. ట్రైకోడెర్మావిరిడేని వేపపిండి, పశువుల ఎరువుతో కలిపి నాటేముందు పొలంలో చల్లుకోవాలి.

News November 12, 2025

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరుతారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ పెద్దలను కూడా సీఎం కలుస్తారని సమాచారం.