News April 9, 2024
ఖానాపురం: కరెంట్ షాక్‌తో రైతు మృతి
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొడ్తె మాటు తండాకు చెందిన చందా(50) అనే రైతు విద్యుత్ షాక్‌తో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. తండా శివారులోని వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 9, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ
భద్రకాళి దేవస్థానంలో నేడు ధనుర్మాసం గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News January 9, 2025
BHPL: భర్తపై భార్య కత్తితో దాడి.. సహకరించిన కొడుకులు
ఆస్తి కోసం కొడుకులతో కలిసి భర్తపై భార్య దాడి చేసిన ఘటన మొగుపల్లి(M) బంగ్లాపల్లిలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ 6 ఎకరాల భూమిని వారి పేరు మీద రాయాలంటూ భార్య, ముగ్గురు కుమారులు తరచూ ఒత్తిడికి గురి చేశారు. ఈ విషయంపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం భార్య, ముగ్గురు కొడుకులు కత్తితో శ్రీనివాస్‌పై దాడి చేయగా ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది.
News January 9, 2025
సమాజంలో మహిళా ఉద్యోగులు ఎంతో కీలకం: జనగామ కలెక్టర్
సమాజంలో మహిళా ఉద్యోగులు ఎంతో కీలకమని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం జనగామ కలెక్టరేట్లో మహిళా శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా వేధింపుల చట్టం, లైంగిక చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడటం చట్టరీత్యా నేరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్, తదితరులు పాల్గొన్నారు.