News January 7, 2025
ఖానాపూర్‌లో చైనా మాంజా కలకలం
ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో చైనా మాంజా తగిలి ఒకరు గాయపడ్డారు. ఆ కాలనీకి చెందిన పరిమి చంద్ర విలాస్ పనిలో భాగంగా చేపలు పట్టడం కోసం సోమవారం గోదావరికి వెళ్తున్న సమయంలో జూనియర్ కాలేజ్ రోడ్డుపై పడిన చైనా మాంజా అకస్మాత్తుగా ఆయన గొంతుకు తగిలి కట్టయ్యింది. స్థానికులు ఆయనను మొదట ఖానాపూర్ ఆస్పత్రికి, అటు నుంచి నిర్మల్ ఆసుపత్రికి తరలించగా నాలుగు కుట్లు పడ్డాయి. ఈ సంఘటన ఖానాపూర్‌లో సంచలనం రేపింది.
Similar News
News January 21, 2025
కడెం: కొడుకును చూడటానికి వెళ్తుండగా ACCIDENT
కడెం మండలం పాండ్వాపూర్ గ్రామానికి చెందిన మల్లపల్లి భూమన్న ఈనెల 19న ఉట్నూరు మండలం సాలెవాడకు తన పని ముగించుకొని కుమారుడిని చూడడానికి వెళ్తూ బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. గమనించిన స్థానికులు నిర్మల్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి పేర్కొన్నారు.
News January 21, 2025
నూతన వధువులను నాగోబాకు పరిచయం చేస్తారు
మెస్రం వంశస్థుల్లో నూతన వధువులను నాగోబా దేవునికి పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తుంది. జాతరలో భాగంగా కుల పెద్దలు నూతన వధువులను నాగోబా దేవుని దగ్గరకు తీసుకువెళ్లి వారితో పూజ చేయించి నాగోబాకు పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కియావాల్’ అంటారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని బోడుందేవ్ జాతర పూర్తయ్యాక ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోతారు.
News January 21, 2025
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే నార్నూర్ రోడ్డు ప్రమాదం: ASP
నార్నూర్ మండలంలో ఐచర్ బోల్తా ఘటన ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవర్ కనక శ్రీరామ్ ఐచర్ వాహనం నడిపినట్లు పేర్కొన్నారు. డ్రైవర్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 2 మృతి చెందగా.. 35 మందికి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.