News February 28, 2025

ఖానాపూర్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఖానాపూర్‌ మండలం బీర్నంది గ్రామంలోని రాజీవ్‌ తండాకు చెందిన బానావత్‌ వెంకటేశ్(27) గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ ఉండే వెంకటేశ్ శివరాత్రి పండుగ సందర్భంగా గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి ఇంటికి వచ్చాడు. భార్య మీనాక్షితో గొడవ కావడంతో వెంకటేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Similar News

News October 28, 2025

MBNR: సౌత్ జోన్.. PU కబడ్డీ జట్టు READY

image

సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాలమూరు వర్సిటీ స్త్రీల కబడ్డీ జట్టు చెన్నైలోని వినాయక మిషన్ ఫౌండేషన్ వర్సిటీకి బయలుదేరింది. వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.జిఎన్ శ్రీనివాస్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు. యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ వై.శ్రీనివాసులు, కోచ్ వెంకటేష్, మేనేజర్ ఉష పాల్గొన్నారు.

News October 28, 2025

కురుమూర్తి జాతర.. భారీ బందోబస్తు- SP

image

మహబూబ్‌నగర్ జిల్లా ‘చిన్న తిరుపతి’గా ప్రసిద్ధి గాంచిన కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా భక్తుల రక్షణ,శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డీ.జానకి తెలిపారు. మొత్తం 680 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని, జాతర ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల నిగ్రహంలో ఉండి, 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే కంట్రోల్ రూమ్‌లో తెలుపాలన్నారు.

News October 28, 2025

HYD: ఇంటింటికీ వెళ్లి మాగంటి సునీత ప్రచారం

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో వెంగళరావునగర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ నేతలు ఈరోజు ప్రచారం చేపట్టారు. సిద్ధార్థనగర్ ఏజీ కాలనీలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. BRSకు ఓటు వేసి, తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.