News March 20, 2025

ఖానాపూర్: గుడుంబా విక్రయం.. 2ఏళ్ల జైలు శిక్ష: SI

image

ఖానాపూర్‌ మండలంలోని పాత ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన మాసం రాజేశ్వర్‌ గతంలో గుడుంబా విక్రయిస్తూ పట్టుబడగా కేసు నమోదు చేసి తహశీల్దార్‌ ముందు బైండోవర్‌ చేశామని ఎక్సైజ్‌ ఎస్సై అభిషేకర్‌ తెలిపారు. బైండోవర్‌ ఉల్లఘించి మళ్లీ మద్యం అమ్ముతూ దొరకారన్నారు. దీంతో బైండోవర్ నిబంధనల ప్రకారం నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.

Similar News

News April 20, 2025

GTకి గుడ్ న్యూస్.. త్వరలో స్టార్ ప్లేయర్ రీఎంట్రీ?

image

తొలి 2 మ్యాచ్‌ల తర్వాత వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లిపోయిన GT స్టార్ బౌలర్ కగిసో రబాడా త్వరలో తిరిగిరానున్నట్లు సమాచారం. మరో 10 రోజుల్లో అతను జట్టుతో చేరే అవకాశం ఉందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించారు. ప్రస్తుతం 5 విజయాలతో గుజరాత్ టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. రబాడా కూడా వస్తే బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది.

News April 20, 2025

చిత్తూరు: రైలు నుంచి పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

గంగాధరనెల్లూరు మండలం నల్లరాళ్ళపల్లికి చెందిన హేమాద్రి ఆచారి కుమారుడు ప్రవీణ్ కుమార్ శనివారం రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న ప్యాసింజర్ రైలులో పూతలపట్టు సమీపంలోని ముత్తురేవులు వద్ద జారిపడి మృతి చెందాడు. తండ్రి సైతం జనవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న జీడీ నెల్లూరు గ్రామంలో, కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 20, 2025

అనకాపల్లి: భర్తపై వేడినీరు పోసిన భార్య

image

అనకాపల్లి మండలం తుంపాలలో భర్తపై భార్య వేడి నీరు పోసి గాయపరిచింది. భర్త చంద్రశేఖర్‌ను ఇల్లరికం రావాలని భార్య లోకేశ్వరి ఒత్తిడి తీసుకువస్తుంది. భర్త నిరాకరించడంతో లోకేశ్వరి వేడి నీరు పోసినట్లు సీఐ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. గాయపడిన భర్త అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

error: Content is protected !!