News March 7, 2025

ఖానాపూర్: పంచాయతీ కార్యదర్శి మృతి

image

అనారోగ్యానికి గురై ఓ పంచాయతీ కార్యదర్శి గురువారం మృతి చెందాడు. మామడ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన దేవళ్ల రాజు (36) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఆయన ఖానాపూర్ మండలంలోని దాసునాయక్ తండా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శి మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంతి సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News October 15, 2025

సూర్యాపేట: ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలి: ఎస్పీ

image

ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీసు ప్రజా భరోసాలో భాగంగా అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రావీణ్యం ఉన్న అంశాలపై సాధన చేయాలని, చెడు అలవాట్లకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల కష్టం చాలా విలువైనదన్నారు. అనంతరం డ్రగ్స్, సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు.

News October 15, 2025

గద్వాల: ‘గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలి’

image

గద్వాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర సమస్యలు పరిష్కరించాలని సీపీఎం గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, కమిటీ సభ్యులు నరసింహ పేర్కొన్నారు. ఇటీవల సీపీఎం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై సర్వే నిర్వహించారు. సర్వేలో పేర్కొన్న సమస్యలను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఎలక్ట్రిసిటీ ఎస్సీకి వివరించి పరిష్కరించాలన్నారు. ఉప్పేరు నరసింహ పాల్గొన్నారు.

News October 15, 2025

ధాన్యం సేకరణ ప్రక్రియపై గద్వాల కలెక్టర్ సమీక్ష

image

ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ ప్రక్రియపై సమీక్ష జరిపారు.