News March 7, 2025

ఖానాపూర్: పంచాయతీ కార్యదర్శి మృతి

image

అనారోగ్యానికి గురై ఓ పంచాయతీ కార్యదర్శి గురువారం మృతి చెందాడు. మామడ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన దేవళ్ల రాజు (36) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఆయన ఖానాపూర్ మండలంలోని దాసునాయక్ తండా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శి మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంతి సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News March 18, 2025

ఆదిలాబాద్: ఎండల నేపథ్యంలో హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు 

image

ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. దింతో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు. 7670904306 సెల్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. ప్రజలు ఏమైనా సమాచారం కోసం సంప్రదించాలన్నారు.

News March 18, 2025

ఆదిలాబాద్: యువకుడికి ST కేటగిరిలో 1st ర్యాంకు

image

ఆదిలాబాద్ రూరల్ లోహర గ్రామానికి చెందిన మర్సకోల జ్యోతిరాం నిన్న విడుదలైన HWO ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటారు. పట్టుదలతో కష్టపడి చదివి రాష్ట్రస్థాయిలో 34వ ర్యాంకు, బాసర జోన్ ST కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కి ఎంపికయ్యారు. ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News March 18, 2025

ఆదిలాబాద్: ఆరుగురు అరెస్ట్

image

మట్కా నిర్వహిస్తున్న మహిళా గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు ADB టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో దాడులు నిర్వహించగా మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. కాగా, ఇందులో నలుగురు ఆడవాళ్లు, ఇద్దరు మగవారు ఉన్నారు. మట్కా చిట్టీలతో పాటు 2 సెల్ ఫోన్లు, రూ.2,260 నగదు స్వాధీనం చేసుకొని.. వారిపై కేసు నమోదు చేశారు.

error: Content is protected !!