News January 30, 2025
ఖానాపూర్: పని ఒత్తిడితో భగీరథ AEE ఆత్మహత్య

మిషన్ భగీరథ ఏఈఈ సాయిచరణ్ పని ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు NZB జిల్లా డిచ్పల్లి SI షరీఫ్ తెలిపారు. ఈ నెల 28న ధర్పల్లిలో విధులకు వెళ్తున్నానని చెప్పిన సాయిచరణ్ డిచ్పల్లి మండలం నడిపల్లి శివారులో పురుగుమందు తాగినట్లు వివరించారు. HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు SIవివరించారు. మృతుడి సోదరి హారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


