News March 22, 2025

ఖానాపూర్: పాకాల వాగు సమీపంలో ముసలి ప్రత్యక్షం

image

గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఈ దారిగుండా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు తెలుపుతున్నారు.

Similar News

News November 1, 2025

టీమ్ఇండియా కప్ గెలిస్తే రూ.125కోట్లు!

image

WWC గెలిస్తే భారత క్రికెట్ జట్టుకు భారీ నజరానా ఇవ్వాలని BCCI భావిస్తున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. గతేడాది T20 WC గెలిచిన పురుషుల జట్టుకు రూ.125కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. మెన్స్ టీంతో సమానంగా మహిళల జట్టుకు కూడా నజరానా అందించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. రేపు ఫైనల్‌లో నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో హర్మన్ సేన పోటీపడనుంది. అటు ICC సుమారు రూ.123CR ప్రైజ్‌మనీ ఇస్తుంది.

News November 1, 2025

‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది’ అంటూ యాడ్!

image

పాన్ కార్డు, బర్త్, స్టడీ సర్టిఫికెట్స్ పోయాయని కొందరు పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాం. అయితే అస్సాంలోని ఓ వార్తాపత్రికలో తన డెత్ సర్టిఫికెట్ పోయిందని యాడ్ రావడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రంజిత్ చక్రవర్తి అనే వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ లంబ్డింగ్ బజార్‌లో పోయిందని ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు దీనిపై స్పందించకపోయినా, ఈ తప్పు ప్రకటన ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

News November 1, 2025

వరి పొలం గట్లపై కంది మొక్కల పెంపకంతో ఏమిటి లాభం?

image

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.