News March 22, 2025
ఖానాపూర్: పాకాల వాగు సమీపంలో ముసలి ప్రత్యక్షం

గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఈ దారిగుండా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు తెలుపుతున్నారు.
Similar News
News April 17, 2025
గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

TG: గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకూ గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది.
News April 17, 2025
నర్సంపేట: వ్యభిచార గృహంపై దాడులు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. గురువారం పక్కా సమాచారం మేరకు ఒకరి ఇంట్లో దాడులు చేయగా.. పట్టణానికి చెందిన ఓ మహిళ, బాంజిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.
News April 17, 2025
ప్రొద్దుటూరులో ఒకేరోజు 60 తులాల బంగారం చోరీ.. 18 కేజీల పసిడి పట్టివేత

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒకేరోజు రెండు సంఘటనలు జరిగాయి. స్థానిక బొల్లవరం నరాల బాలిరెడ్డి కాలనీలో యెనమల చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులెవ్వరూ లేని సమయంలో 60 తులాల బంగారం చోరీ జరిగింది. మరోవైపున స్థానిక రామేశ్వరం బైపాస్ రోడ్డులో వాహన తనిఖీల్లో పోలీసులు ఒక కారులో రికార్డులు లేని 18 కేజీల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు.