News September 4, 2024
ఖానాపూర్: పేపర్ బాయ్ టు MLA

పేపర్ బాయ్ టు MLA వరకు ఎదిగిన ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శనీయం. నేడు పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆయన చిన్నతనంలో చదువుతోపాటు పేపర్ బాయ్‌గా, కాలేజీ రోజుల్లో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరోవైపు విలేకరిగా పనిచేశారు. అనంతరం ITDA పైసా చట్టం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలుపొందారు.
Similar News
News September 18, 2025
ADB: క్రైస్తవ సంఘాలతో ఛైర్మన్ సమావేశం

రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్‌లో బుధవారం పర్యటించారు. కలెక్టర్ రాజర్షిషాతో కలిసి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రైస్తవ శ్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.
News September 18, 2025
ఆరోగ్యమే మహాభాగ్యం: ఆదిలాబాద్ ఎంపీ

ఆదిలాబాద్‌లో నిర్వహించిన స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. బుధవారం హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్లో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి పేదలకు పథకం ద్వారా అందించే ఫుడ్ కిట్స్‌ను ఎంపీ పంపిణీ చేశారు. శిక్షణ కలెక్టర్ సలోని, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.
News September 17, 2025
ఆదిలాబాద్: పోలీస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

ఆదిలాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు.