News September 4, 2024

ఖానాపూర్: పేపర్ బాయ్ టు MLA

image

పేపర్ బాయ్ టు MLA వరకు ఎదిగిన ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శనీయం. నేడు పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆయన చిన్నతనంలో చదువుతోపాటు పేపర్ బాయ్‌గా, కాలేజీ రోజుల్లో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరోవైపు విలేకరిగా పనిచేశారు. అనంతరం ITDA పైసా చట్టం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలుపొందారు.

Similar News

News September 19, 2024

ఆదిలాబాద్: క్రీడాకారుల వివరాలు ఇవ్వండి: DYSO

image

అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పతకాలు సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ పూర్తి వివరాలు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయంలో ఈ నెల 23లోపు అందించాలని DYSO వేంకటేశ్వర్లు తెలిపారు. 2019 నుంచి ఇప్పటి వరకు పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారి వివరాలను పట్టిక రూపంలో పొందుపర్చనున్నారు. వివరాలకు ఆదిలాబాద్ క్రీడా పాఠశాల జూడో కోచ్ రాజును సంప్రదించాలన్నారు.

News September 18, 2024

ADB: ఆ గ్రామంలో 10 మంది కవల పిల్లలు.. గుర్తించలేక తికమక..!

image

తాంసి మండలం వడ్డాడి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకే రూపంలో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు (కవలలు) కనిపిస్తారు. ఈ కవలల్లో ఎవరు ఎవరో అని గ్రామస్థులే కాదు తల్లిదండ్రులు కూడా గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలో 10 మందికి పైగా కవలలు ఉండటంతో వీరిని గుర్తించే విషయంలో గ్రామస్థులు తికమక పడుతుంటారు. గ్రామంలో గౌతమి-గాయత్రి, వర్షిత్-హర్షిత్, కావ్య- దివ్య, రామ్-లక్ష్మణ్ అని వారిని పలకరిస్తారు.

News September 18, 2024

భీంపూర్: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులుల సంచారం

image

భీంపూర్ మండలం పెనుగంగ నదికి అవతల ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయి. రామ్‌నగర్- సావర్గాం మార్గంలో మూడు పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించగా వాటిని ఫొటో తీశాడు. తిప్పేశ్వర్ అభయారణ్యం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండటంతో తరుచూ పులులు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వేసవిలో నది దాటి భీంపూర్ వస్తున్నాయన్నారు.