News April 12, 2025
ఖానాపూర్: లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

లయన్స్ క్లబ్ ఆఫ్ ఖానాపూర్ అన్నదాత నూతన అధ్యక్షుడిగా సాదుల వెంకటస్వామి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాచమల్ల రాజశేఖర్, కోశాధికారిగా పి.రాంచందర్ ఎన్నికయ్యారు. శుక్రవారం లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320డి అదనపు క్యాబినేట్ సెక్రటరీ ఎం.రాజన్న హాజరై 2025–26 సంవత్సరానికి ఎన్నికలు నిర్వహించారు.
Similar News
News December 7, 2025
వామ్మో! HYDలో భారీగా పెరిగిన ధరలు

నగరంలో గుడ్ల ధరలు కొండెక్కాయి. విడిగా కొంటే గుడ్డు రూ.8- 9 వరకు అమ్ముతున్నారు. డజన్ రూ.90కి, ట్రే 220- 230 వరకు విక్రయిస్తున్నారు. ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్లో ఎగ్ డీలర్స్ వద్ద స్టాక్ లేకపోవడం ధరల ఎఫెక్ట్ కనిపిస్తోంది. వర్కవుట్స్ చేసే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోటీన్ సోర్స్ గుడ్డే..త్వరగా కర్రీ చేసుకునే బ్యాచిలర్లు ఇబ్బందిగానే మారిందంటున్నారు. 3వారాలుగా గుడ్ల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
News December 7, 2025
MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్ల విత్డ్రా

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.
News December 7, 2025
MBNR: సర్పంచ్ బరిలో 641 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల కోసం 641 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 133 గ్రామ పంచాయతీలకు గాను, జడ్చర్ల మండలంలో ఒకటి ఏకగ్రీవమవడంతో 132 జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా బాలానగర్లో 37, జడ్చర్లలో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.


