News February 13, 2026
ఖానాపూర్: 4 ఓట్ల తేడాతో మౌనిక(BJP) విన్

ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో BJP ఖాతా తెరిచింది. 9వ వార్డులో పార్టీ అభ్యర్థి అంకం మౌనిక తన సమీప ప్రత్యర్థిపై 4 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పార్టీ సిద్ధాంతాలను, తనను నమ్మి ఓటు వేసిన ఓటర్లకు ఆమె మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు
Similar News
News March 6, 2026
మహిళల ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఎంతో మేలు: ఎంపీ సురేష్

స్వయం సహాయక సంఘాల మహిళలకు ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ అన్నారు. మెదక్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, రైతులకు సకాలంలో బీమా అందేలా చూడాలని అధికారులను కోరారు. అలాగే సింగూరు మరమ్మతుల దృష్ట్యా వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
News March 6, 2026
భద్రాద్రిలో వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం నిత్య కళ్యాణ వేడుక కనులపండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన అనంతరం, ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, కంకణధారణ గావించి సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించి తరించారు.
News March 6, 2026
అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 208 మంది గైర్హాజర్

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 208 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. 6,575 మంది హాజరు కావలసి ఉండగా 6,367 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.


