News November 10, 2024

ఖాళీ స్థలాల యజమానులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం, చెత్త వేయడం వల్ల దోమలు, కోతులతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఖాళీ ప్లాట్ లను యజమానులు శుభ్రం చేయకుంటే వెంటనే ప్రభుత్వ స్థలంగా బోర్డులు పెట్టాలని ఆదేశించారు. కూడలి ఉన్న ప్రదేశంలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు.

Similar News

News November 14, 2024

KMM: రేపు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం

image

రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు డయల్ యువర్ RM కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో, ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఏమయినా సూచనలు, సలహాలు లేదా ఏవైనా సమస్యలను తెలియజేయడానికి, పైన సూచించిన సమయంలో 99592 25954 నంబర్‌కు డయల్ తెలిపారు.

News November 14, 2024

పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్

image

పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ వి.పాటిల్ అన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం, బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

News November 14, 2024

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొంగులేటి

image

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, కానీ రైతుల ముసుగులో అధికారులపై దాడులు చేయడం సరికాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలను ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.