News September 23, 2024
ఖేడ్: ఆ మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలి: KVPS
నారాయణఖేడ్‌లో అధిక ధరలకు టాబ్లెట్లు అమ్ముతున్న మెడికల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక కేవీపీఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజలకు అధిక ధరలకు మెడికల్ యజమానులు మందులు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని.. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News October 11, 2024
MDK: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
MDK, సంగారెడ్డి, SDPT జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కోమటి చెరువుపై బతుకమ్మ వేడుకలు.. హరీష్ రావుతో సెల్ఫీలు
సద్దుల బతుకమ్మ సందర్భంగా సిద్దిపేటలోని కోమటి చెరువుపై గురువారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగాయి. రంగురంగుల పూలతో విభిన్న ఆకృతుల్లో బతుకమ్మలను ఆడపడుచులు పేర్చి ఒకచోట చేర్చి ఆటపాటలు ఆడుతూ సందడి చేశారు .స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తిలకించారు. ఆడపడుచులు హరీష్ రావుతో సెల్ఫీలు దిగాలని తాపత్రయపడగా స్వయంగా హరీష్ రావే సెల్ఫీ ఫోటోలు క్లిక్ మనిపించారు.