News August 10, 2024
ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక వస్తే మనదే గెలుపు: KTR
ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా ఉప ఎన్నిక వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. మీ కామెంట్?
Similar News
News September 13, 2024
నంది మేడారం: డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: ప్రభుత్వ విప్
పెద్దపల్లి జిల్లాలో ఈనెల 14న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ధర్మారం మండలం నంది మేడారం పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News September 13, 2024
CM రేవంత్ రెడ్డిని కలిసిన రామగుండం MLA
రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు HYDలోని CM రేవంత్ రెడ్డి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల రామగుండంలో 1,800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో CMకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రామగుండం మెడికల్ కాలేజీలో అదనంగా నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ విభాగాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి CM సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
News September 13, 2024
కరీంనగర్: రుణమాఫీపై స్పష్టత ఏది!
రుణమాఫీ కాలేదని ఇటీవల జగిత్యాల జిల్లా భూషణరావుపేట చెందిన రైతు ఏనుగు సాగర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం రైతులతో పాటు అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రుణమాఫీ కాక రైతులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కట్టాలా..? వద్దా…? కడితే.. ఎప్పుడు రుణమాఫీ చేస్తారో తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారు.