News August 28, 2024
ఖైరతాబాద్: గణేశ్ ఉత్సవాల సమయంలో అదనపు ట్రిప్పులు

ఖైరతాబాద్ మెట్రోస్టేషన్‌లో డిమాండ్ మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో అదనపు మెట్రోరైళ్లు నడిపిస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి సందర్శనకు వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మెట్రోరైళ్లు నడిపిస్తామని వెల్లడించారు. ప్రజా అవసరాల దృష్ట్యా మెట్రోరైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
Similar News
News December 4, 2025
రంగారెడ్డి: తొలి విడతలో ఆరుగురు సర్పంచ్లు ఏకగ్రీవం

రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆరుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,340 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 3,379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
News December 3, 2025
REWIND: రంగారెడ్డిలో 135 ఏకగ్రీవం.. రూపాయి రాలేదు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2న పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించింది. ఏకగ్రీవ చిన్న పంచాయతీలకు రూ.10లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,185 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 135 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవీ కాలం ముగిసినా ఏకగ్రీవ పంచాయతీలకు ఇంకా పారితోషకం అందలేదు.
News December 2, 2025
RR: ‘రెండో విడత నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి’

గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు అన్ని విధాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా అధికారిని నడుచుకోవాలని ఆదేశించారు.


