News August 28, 2024
ఖైరతాబాద్: గణేశ్ ఉత్సవాల సమయంలో అదనపు ట్రిప్పులు

ఖైరతాబాద్ మెట్రోస్టేషన్‌లో డిమాండ్ మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో అదనపు మెట్రోరైళ్లు నడిపిస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి సందర్శనకు వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మెట్రోరైళ్లు నడిపిస్తామని వెల్లడించారు. ప్రజా అవసరాల దృష్ట్యా మెట్రోరైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
Similar News
News April 16, 2026
RR: హీట్ వేవ్.. ఇవి తప్పని సరి: DMHO

RR జిల్లాలో తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. లలితాదేవి సూచించారు. మజ్జిగ, కొబ్బరినీళ్లు, ORS తీసుకోవాలని, మ.12 నుంచి సా.4 వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చారించారు. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి అవసరమైతే 108కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News April 16, 2026
RR: మండుతున్న ఎండలు.. ఇవి తప్పనిసరి

రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. దీంతో డీ హైడ్రేషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.లలితాదేవి తెలిపారు. సాధ్యమైనంత వరకు మ.12 గం. నుంచి 4 వరకు బయట తిరగక పోవడమే ఉత్తమమని, అనివార్యమైతే వెంట గొడుగు, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని సూచించారు
News April 14, 2026
రంగారెడ్డిలో 40 దాటింది.. జాగ్రత్త!

రంగారెడ్డిలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్గుల్, ఎలిమినేడు ప్రాంతాల్లో 41.7 డిగ్రీలు, బోడకొండ, రాచులూరు ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. యాచారం, మొయినాబాద్, కడ్తాల్ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SHARE IT


