News April 4, 2025
ఖైరతాబాద్: టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్

గ్రేటర్ పరిధిలో వర్షాల పట్ల జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అన్నారు. వాటర్ లాగిన్ పాయింట్లను గుర్తించాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే జీహెచ్ఎంసీ నంబర్ 040-21111111కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News October 14, 2025
BREAKING: HYD: మాగంటి సునీత, కూతురిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మసీదు వద్ద ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శుక్రవారం యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలోని మసీదు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేయాలని ప్రభావితం చేశారని పేర్కొన్నారు. సునీతను A1, అక్షరను A2గా, మరికొంత మందిని చేరుస్తూ కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
News October 14, 2025
‘జూబ్లీహిల్స్లో BRS గెలిస్తే NEXT CM KCR’

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను BRS ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిస్తే మళ్లీ తిరిగి కారు ఫామ్లోకి వస్తుందని, 100 స్పీడ్లో దూసుకెళ్తుందని BRS నేతలు అంటున్నారు. ఇటీవల KTR మాట్లాడుతూ.. 2028లో KCR CM కావడానికి జూబ్లీహిల్స్ నుంచే జైత్ర యాత్ర మొదలు పెట్టాలని ఓటర్లను రిక్వెస్ట్ చేశారు. దీంతో ‘జూబ్లీహిల్స్లో BRS గెలిస్తే NEXT CM KCR’ అంటూ ఆ పార్టీ శ్రేణులు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నాయి. మీ కామెంట్?
News October 14, 2025
HYD: ‘కాంగ్రెస్ గెలిస్తే జూబ్లిహిల్స్పై వరాల జల్లు’

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అటు BRSతోపాటు ఇటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడి ఫలితాల ప్రభావం ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లపై ఉంటుందని, క్షేత్రస్థాయిలో నాయకులు పర్యటించి కాంగ్రెస్ను భారీ మెజార్టీతో గెలిపించేలా చూడాలని ఇప్పటికే CM రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే జూబ్లిహిల్స్పై CM వరాల జల్లు కురిపిస్తారంటూ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?