News September 5, 2024
ఖైరతాబాద్: డిప్యూటీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. అనంతరం డిప్యూటీ సీఎంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్, కమిటీ సభ్యులు ఉన్నారు.
Similar News
News January 23, 2025
ఓయూలో పీజీ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల
ఓయూలో దూరవిద్య పరిధిలోని వివిధ పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. M Com, MA, Msc తదితర కోర్సుల మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
News January 22, 2025
అర్హుల ఎంపికకే గ్రామసభలు: MRO జయరాం.!
అర్హుల ఎంపికకే గ్రామసభలు నిర్వహింస్తున్నామని MRO జయరాం అన్నారు. నవాబ్‌పేట్ మండలంలోని మీనేపల్లికలాన్, ముబారక్‌పూర్ గ్రామాలల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో MRO పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 24 వరకు గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. అర్హత ఉండి జాబితాలోలేని వారి గురించి ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లో మళ్లీ దరఖాస్తులను స్వీకరించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందిస్తామన్నారు.
News January 22, 2025
VIRAL: MLA పద్మారావు లేటెస్ట్ ఫొటో
సికింద్రాబాద్ MLA T.పద్మారావు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనులతో ఆయన ఆదివారం డెహ్రాడూన్ వెళ్లారు. ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు స్టంట్ వేసి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అయితే, డెహ్రాడూన్‌లోని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పద్మారావు కోలుకున్నారని, ఆస్పత్రిలో కుటుంబీకులతో దిగిన ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.